: అమెరికాకు బ్రేక్ వేసేందుకు.. ఇరాన్ వేసిన ఎత్తుతో చెన్నైకి తిప్పలు!
చెన్నై తీరానికి కొట్టుకొస్తున్న చమురు తెట్టు, తమిళనాడు ప్రభుత్వానికి సవాల్ గా మారిన వేళ, ఈ చమురు రెండు కార్గో నౌకలు ఢీకొనడం వల్ల వచ్చింది కాదని, దీని వెనుక అమెరికాను అడ్డుకునేందుకు ఇరాన్ వేసిన ఎత్తు ఉందని తెలుస్తోంది. అమెరికన్ నౌకలను అడ్డుకునేందుకు హిందూ మహా సముద్రంలో ఇరాన్ చమురును వదులుతుండగా, అది కొట్టుకుని తమిళనాడు తీరానికి వస్తోందని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోందని అధికారులు తెలిపారు. కొన్ని నౌకల్లో ముడి చమురును నింపి, వాటిని సముద్రం మధ్యలోకి పంపుతున్న ఇరాన్, చమురును గుమ్మరిస్తోందని తెలుస్తోంది. చమురు తెట్టు కారణంగా చేపలకు డిమాండ్ పడిపోయిందని, తమ బతుకులు ఇబ్బందుల్లో పడ్డాయని తమిళనాడు మత్స్యకారులు వాపోతున్నారు. గత ఐదు రోజులుగా వందలాది మంది కోస్టు గార్డులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు చమురు తెట్టును తొలగించేందుకు కృషి చేస్తున్నారు.