: జగన్ మరోసారి గెలిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తా: మండలి డిప్యూటీ చైర్మన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభివృద్ధి నిరోధకుడని ఏపీ మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ హీరో కాదని, జీరో అని అభివర్ణించారు. జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. జగన్ మళ్లీ గెలిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తానని అన్నారు. ప్రజలు ఎవరూ జగన్ ను విశ్వసించడం లేదని, ఆ విషయాన్ని జగన్ ఇంకా అర్థం చేసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. చిత్రావతి రిజర్వాయర్ దగ్గర గండికోట లిఫ్ట-5 నిర్మాణంతో అధికారులతో సమీక్ష జరిపిన ఆయన, ఈ నెల 11లోగా చిత్రావతి రిజర్వాయర్ కు కృష్ణా జలాలు చేరేలా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.