: హిందూపురం నియోజక వర్గంలో బాలయ్యకు అసంతృప్తుల సెగ!


అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో లుకలుకలు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రశేఖర్‌ (శేఖర్‌) వ్యాఖ్యలతో టీడీపీలో వర్గవిభేదాలు రాజుకున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గం పిఏ శేఖర్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయింది. ఈ క్రమంలో చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీలు తమ పదవులకు రాజీనామా చేశారు. రేపు ఉదయం హిందూపురంలో సమావేశం కూడా నిర్వహించనున్నారు. కాగా, బాలకృష్ణ పీఏ అనుకూల వర్గానికి చెందిన నేతలు లేపాక్షిలో ర్యాలీ నిర్వహించారు. శేఖర్‌ మితిమీరిన జోక్యానికి చెక్‌ పెట్టాలంటూ చిలమత్తూరు, లేపాక్షి ప్రాంతాల నేతలు డిమాండ్ చేస్తుండగా, అవినీతిలో కూరుకుపోయినవారే తనను వ్యతిరేకిస్తున్నారంటూ శేఖర్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గం రాజకీయాలు ఏపీలో ఆసక్తికరంగా మారాయి.

  • Loading...

More Telugu News