: ఒక దేశంలోకి ఎవరు రావాలో, రాకూడదో నిర్ణయించలేకపోతే చాలా కష్టం: ట్రంప్
ఏడు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలతో పాటు ఆందోళన కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆయన తన నిర్ణయంపై మరోసారి ట్విట్టర్ లో స్పందించారు. 'ఒక దేశంలోకి ఎవరు రావాలో, ఎవరు రావద్దో చెప్పలేనప్పుడు, అందులోనూ అది భద్రతా కారణాలకు సంబంధించిన అంశం అయినప్పుడు అది చాలా పెద్ద సమస్య అవుతుందం'టూ ట్వీట్ చేశారు. కాగా, తాజాగా ఇరాన్ అణుపరీక్షలు నిర్వహించడంపై కూడా ట్విట్టర్ మాధ్యమంగానే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఆంక్షలు విధించాల్సి వస్తుందంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే.