: విజయవాడలో ఘనంగా నేవీ షో
విశాఖపట్టణం సముద్ర జలాల్లో సందడి చేసే నావికాదళం ఈసారి విజయవాడలో సందడి చేసింది. కృష్ణా జిల్లాలోని విజయవాడలో ప్రకాశం బ్యారేజీ సమీపంలోని కృష్ణా నదీ జలాల్లో నేవీ షో జరిగింది. ఈ షోకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఈస్ట్రన్ నేవల్ కమాండ్ చీఫ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పున్నమి ఘాట్ నుంచి వారు నేవీ విన్యాసాలు వీక్షించారు. ఈ సందర్భంగా నేవీ విమానాల విన్యాసాలు, చేతక్ హెలికాప్టర్లతో నేవీ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అలాగే స్పీడ్ బోట్లపై నేవీ కమాండోల విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. వీటిని వీక్షించేందుకు భారీ ఎత్తున నగరవాసులు కృష్ణానది ఒడ్డుకు చేరుకున్నారు.