: నాగాలాండ్ లో ప్రజాగ్రహ జ్వాలలు...సచివాలయం, సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
నాగాలాండ్ లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుపై నాగాలాండ్ అట్టుడుకుతోంది. దీంతో గత కొన్ని రోజులుగా గిరిజన గ్రూపులు పట్టణాల్లో ఆందోళనలతో కదంతొక్కుతున్నాయి. ఈ క్రమంలో నాగాలాండ్ లోని కోహిమా పట్టణంలోని సెక్రటేరియట్ లోని పలు కార్యాలయాలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు, ముఖ్యమంత్రి టీఆర్.జైలింగ్ నివాసానికి కూడా నిప్పుపెట్టారు. దిమాపూర్ లో కూడా ఈ గిరిజన గ్రూపులు, వాటి మద్దతు సంఘాలు భారీ ఎత్తున విధ్వంసానికి దిగాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.