: ప్రభుత్వ సిబ్బంది అలసత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే


రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందిపై ఎమ్మెల్యే కాలే యాదయ్య తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు ఆయా కార్యాల‌యాల్లో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించిన ఆయ‌నకు షాకింగ్ నిజాలు తెలిశాయి. ఉద‌యం 11.30 అవుతున్నప్ప‌టికీ ప‌లు కార్యాలయాలు తెర‌చుకోలేదు. ఉద‌యాన్నే వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాల్సిన‌ ఎంపీడీవో, ఎమ్మార్వో ఆఫీసులు ఖాళీగా క‌నిపించాయి. దీంతో ప్రభుత్వ సిబ్బంది అల‌స‌త్వంపై ఎమ్మెల్యే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు వారి తీరుపై స్థానికులు కూడా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అక్క‌డి ఉద్యోగుల తీరు మార‌క‌పోతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

  • Loading...

More Telugu News