: విజయాన్ని రాహుల్ కు కానుకగా ఇస్తాం: సిద్దూ


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ధీమా వ్యక్తం చేశారు. అమృత సర్ లో తన భార్య నవజ్యోత్ కౌర్ తో కలసి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాహుల్ గాంధీకి కానుకగా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది ధర్మ యుద్ధమని, ఇందులో తామే విజయం సాధిస్తామని తెలిపారు. పంజాబ్ లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని చెప్పారు. 

  • Loading...

More Telugu News