balasubrahmaniam: చాలామంది గాయకులు అనామకులుగా మిగిలిపోతున్నారు: బాలసుబ్రహ్మణ్యం ఆవేదన
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రసిద్ధ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం నాటి, నేటి గాయకులకు మధ్య ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణలో తేడాలను గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. అప్పట్లో దర్శకుడు తాము తీసే సినిమాలో ఆరు రకాల పాటలుంటే వాటన్నింటినీ ఒకే గాయకుడితో పాడించేవారని ఆయన చెప్పారు. దీంతో ఆ గాయకుడి ప్రతిభ గురించి ప్రేక్షకులందరికీ తెలిసేదని చెప్పారు. అయితే, ఇప్పుడు మాత్రం దర్శకులు ఒక సినిమాలో ఆరు పాటలను ఆరుగురు గాయకులతో పాడిస్తున్నారని ఆయన అన్నారు.
అంతేగాక ఒక్కోసారి సినిమాలోని ఒకే పాటను ఇద్దరు గాయకులతో కూడా పాడిస్తున్నారని బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. దీంతో గాయకుడిలో ఉన్న ప్రతిభ ప్రేక్షకులకు తెలిసే అవకాశాలు ఇప్పుడు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అంతా ఇలా వెరైటీ కోసం తాపత్రయపడుతున్నారని, అందుకే ఎంతో మండి గాయకులు అనామకులుగానే మిగిలిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.