: జయలలిత మృతిపై విచారణకు సిద్ధం.. ప్రకటించిన ఆపోలో గ్రూప్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత మృతిపై విచారణకు సిద్ధమని అపోలో గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి ప్రకటించారు. శుక్రవారం చెన్నైలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జయలలిత మృతి విషయంలో ఎటువంటి విచారణను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తామని పేర్కొన్నారు. విచారణ జరిపితే అన్ని విధాలా పూర్తిగా సహకరిస్తామన్నారు. జయలలిత ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందనుకుంటున్న సమయంలో వచ్చిన గుండెపోటు వల్లే ఆమె మృతి చెందారని ప్రతాప్ సి.రెడ్డి వివరించారు. చనిపోవడానికి ముందు జయ కాళ్లను తొలగించామన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.