: అభివృద్ధికి అడ్డుపడితే ఆ రెండు పార్టీలకు పుట్టగతులుండవ్: మంత్రి జూపల్లి
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు పుట్టగతులుండవని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే తమ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనే భయంతోనే రాష్ట్రంలో అభివృద్ధికి వారు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకం వైపు ఉంటారో లేక పొరుగు రాష్ట్రానికి వంత పాడతారో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తేల్చుకోవాలని సూచించారు. విపక్షపార్టీలు తలకిందులుగా తపస్సు చేసినా సరే, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఆగదని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడని అన్నారు.