: ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంట్లో ఏసీబీ దాడి... భారీగా డబ్బు, రెండు కౌంటింగ్ మిషన్లు స్వాధీనం
అతడు ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కానీ, అతని ఇంట్లో మాత్రం బోలెడంత డబ్బు ఉంది. వాటిని లెక్కించడానికి రెండు కౌంటింగ్ మిషన్‌లు కూడా ఉన్నాయి. ఉద్యోగ ధర్మాన్ని పక్కనబెట్టి లంచం తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ కానిస్టేబుల్ వాహనదారులను బెదిరిస్తూ డబ్బు లాగుతున్నాడు. ఏసీబీకి అడ్డంగా దొరికిన అతడు కర్ణాటకలోకి కల్బుర్గి ప్రాంతంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల అతగాడి అవినీతిపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అతడి ఇంటి మీద దాడులు జరిపి ఏకంగా రూ.11.23 లక్షల నగదు, 265 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.