: చైనా విమానాశ్రయంలో డిష్యూం.. డిష్యూం!


విమానాశ్రయంలో ఇద్దరు ప్ర‌యాణికులు ఒకరిపై ఒక‌రు క‌ల‌బ‌డి అల‌జ‌డి రేపిన ఘ‌ట‌న చైనాలోని గ్వాంగ్‌జౌ బైయూన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ప్రయాణికులతో ర‌ద్దీగా ఉన్న విమానాశ్ర‌యంలో క్యూ పెద్దగా ఉండటంతో ఓ ప్ర‌యాణికుడు అసహనం చెందాడు. అనంత‌రం క్యూ నుంచి తప్పుకుని అంద‌రినీ దాటుకొని నేరుగా కౌంటరు వద్దకు వెళ్లాల‌ని చూశాడు. అది గ‌మ‌నించిన మ‌రో ప్ర‌యాణికుడు అతనిని అడ్డుకున్నాడు. ఈ నేప‌థ్యంలో వారి ఇద్దరి మధ్య ఘర్షణ చెల‌రేగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.

వారిని విమానాశ్ర‌య సిబ్బంది అడ్డుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌వడంతో, మ‌రికాసేపు వారి ఫైటింగ్ కొన‌సాగింది. అనంత‌రం గొడ‌వ మ‌రింత పెరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తి కుటుంబసభ్యులు ఇతర ప్రయాణికులతోనూ గొడ‌వ‌కు దిగారు. చివ‌ర‌కు ఎట్ట‌కే‌ల‌కు ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎంతో శ్రమించి వారిరువురినీ విడదీశారు. ఘ‌ర్ష‌ణ‌కు దిగిన ప్ర‌యాణికుల పేర్లు జావో, లియూ అని అధికారులు తెలిపారు. తాము అడ్డుకున్న త‌రువాత కూడా లియూ వెనక్కి వెళ్లి మరీ జావోని కొట్టాడ‌ని తెలిపారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో జావో నోటి నుంచి రక్తం వచ్చిందని తెలిపారు. వారిద్ద‌రినీ అదుపులోకి తీసుకోగా, చివరికి వారిద్దరూ క్షమాపణలు చెప్పుకొన్నారని అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News