: వాక్యూమ్ క్లీనర్ లో బంగారం పెట్టి తరలిస్తోన్న వ్యక్తి అరెస్ట్


ముంబ‌యి ఎయిర్‌పోర్టులో ప్ర‌యాణికుల త‌నిఖీల్లో భాగంగా సోదాలు నిర్వ‌హిస్తోన్న కస్టమ్స్ అధికారులు ఓ వ్య‌క్తి వ‌ద్ద భారీగా బంగారం ఉన్న‌ట్లు గుర్తించి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. స‌ద‌రు ప్ర‌యాణికుడి వ‌ద్ద మొత్తం 1.235 కిలోల బంగారాన్ని గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. ఆ ప్ర‌యాణికుడు మినీ వాక్యూమ్ క్లీనర్ లోపలి భాగంలో దాన్ని ఉంచి తరలిస్తున్నట్లు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. తాము స్వాధీనం చేసుకున్న‌ బంగారం విలువ రూ.32 లక్షలు ఉంటుందని మీడియాకు చెప్పారు.

  • Loading...

More Telugu News