: కాబోయే మామగారితో స్క్రీన్ ను పంచుకోనున్న సమంత!


తనకు కాబోయే మామగారు హీరో నాగార్జునతో కలసి మరో చిత్రంలో సమంత నటించనుంది. హారర్ కామెడీగా వచ్చి సైలెంట్ హిట్ కొట్టిన 'రాజు గారి గది'కి సీక్వెల్ గా వస్తున్న 'రాజు గారి గది 2'లో నాగార్జున నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే చిత్రంలోని మరో కీలక పాత్రలో నటించేందుకు సమంత అంగీకరించింది. నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ తరువాత సమంత అంగీకరించిన తొలి చిత్రం ఇదే. చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, సమంత అతి త్వరలోనే జాయినవుతుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమాన్, మ్యాట్నీ ఎంటర్ టెయిన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News