: విశాఖ ఎయిర్ పోర్టులో అడ్డుకోవడంపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్న వైకాపా ఎంపీలు
వైకాపా ఎంపీలు నేడు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలవనున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో తమపై పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల ఈ సందర్భంగా ఆమెకు ఫిర్యాదు చేయనున్నారు. ఈ ఘటనపై ప్రివిలేజ్ కమిటీ చేత విచారణ చేయించాలని స్పీకర్ ను కోరనున్నారు. విశాఖ ఆర్కే బీచ్ లో జగన్ తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, జగన్ ను విమానాశ్రయంలోనే అడ్డుకుని, అక్కడ నుంచే హైదరాబాదుకు తిప్పి పంపించేశారు.