: ట్రంప్ స్ఫూర్తితోనే నేను యాక్టివ్ అయ్యా: నాగార్జున
ట్రంప్ పేరెత్తితేనే చాలా మంది చికాకుపడిపోతున్న సంగతి తెలిసిందే. మన హీరో నాగార్జున మాత్రం ట్రంప్ తనకు ఆదర్శం అన్నారు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తీకరించడంలో ట్రంప్ సూపర్ అన్నారు నాగ్. సోషల్ మీడియా ద్వారా తన మనసులోని భావాలను ట్రంప్ చాలా చక్కగా చెబుతారని... ఎన్నికల్లో ఆయన గెలవడానికి కూడా ఇదే కారణమని తెలిపారు. ట్రంప్ స్ఫూర్తితోనే తాను కూడా ట్విట్టర్ లో యాక్టివ్ అయ్యానని చెప్పారు. మన గురించే ఎవరో చెప్పడం కంటే... మన గురించిన సమాచారాన్ని మనమే జనాలతో నేరుగా చెప్పుకుంటే బాగుంటుందని అన్నారు. నాగ్ తాజా చిత్రం 'ఓ నమో వేంకటేశాయ' ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.