: బడ్జెట్ లో అంకెల గారడీ తప్ప మరేం లేదు: మమతా బెనర్జీ


కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెదవి విరిచారు. కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, బడ్జెట్ ఏమంత గొప్పగాలేదని అన్నారు. బడ్జెట్ లో అంకెల గారడీ తప్ప ప్రత్యేకంగా ఏమీ కనపడలేదని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్ లో ఏ రంగానికీ స్పష్టమైన కేటాయింపులు లేవని, వివిధ రంగాల్లో వివిధ విభాగాలకు కేటాయింపులు జరిగి ఉంటే బాగుండేదని, అలా కాకుండా అంకెల గారడీతో బడ్జెట్ అందర్నీ తప్పుదోవ పట్టించేలా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే బడ్జెట్ రూపొందించిన వారు దాని అమలుకు తగిన కార్యాచరణ, దూరదృష్టి లేకుండా రూపొందించారని ఆమె తెలిపారు. బడ్జెట్ ఏ రంగాన్నీ ఆకట్టుకోలేదని ఆమె అన్నారు. 

  • Loading...

More Telugu News