: ముచ్చటగా మూడోసారి కలసి నటిస్తున్న సమంత, కాజల్!
టాలీవుడ్ టాప్ హీరోయిన్లు సమంత, కాజల్ ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారు. ఇప్పటికే ‘బృందావనం’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తమిళ స్టార్ విజయ్ సినిమాలో నటించనున్నారని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ సరసన కాజల్, సమంత నటించనున్నారని, వారితోపాటు ఎస్ జే సూర్య, జ్యోతిక, శివరాజ్ కుమార్ లు నటించనున్నారని కూడా తెలిపారు. జ్యోతిక, సమంత, కాజల్ పాత్రలకు సమప్రాధాన్యం ఉంటుందని వారు చెప్పారు. ఈ సినిమాకు అట్లీ కుమార్ దర్శకత్వం వహించనున్నాడని వారు తెలిపారు. ఈ భారీ బడ్జెట్ సినిమా కథ, కథనాలు అందర్నీ ఆకట్టుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.