: ఇలా.. ఎవరూ సెల్ఫీలకు ప్రయత్నించకండి: అమెరికా యువతి విజ్ఞప్తి


వెరైటీ సెల్ఫీ దిగాలని భావించిన అమెరికా యువతికి ఊహించని సంఘటన ఎదురైంది. చివరకు, ఆసుపత్రికి వెళ్లి తన చెవిని కాస్త కట్ చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఓరెగాన్ లోని పోర్ట్ లాండ్ కు చెందిన ఆష్లే గ్లేవ్ కు ఓ చిన్న సైజు పెంపుడు పాము ‘బార్ట్’ ఉంది. ఆ పామును తన కుడి చెంప పక్కన పెట్టుకుని సెల్ఫీ దిగాలని చూసింది. అయితే, ఓ ఆభరణం పెట్టుకునే నిమిత్తం చెవికి ఓ పెద్ద రంధ్రాన్ని పెట్టించుకుంది. సెల్ఫీ దిగుదామని కుడి చెంప పక్కన పెట్టుకున్న ఆ పాము కాస్తా, ఆ రంధ్రంలోకి వెళ్లింది. ఆ రంధ్రంలో నుంచి బయటకు రాలేక బార్ట్ నానా ఇబ్బందులు పడింది. దాంతో ఆష్లేకు తిప్పలు తప్పలేదు.

చివరకు, దానిని బయటకు తీయడం వీలుకాక పోవడంతో, దగ్గరలో ఉన్న ఓ ఆసుపత్రికి వెళ్లింది. ఆష్లేను చూడగానే వైద్యులకు విషయం అర్థమైపోయింది. రంధ్రంలో ఇరుక్కున్న పామును తీసేందుకు వైద్యులు సమాయత్తమవుతున్న సమయంలో ఆష్లే వైద్యులకు ఒక విజ్ఞప్తి చేసింది. ‘బార్ట్’కు ఏమాత్రం హాని జరగకూడదని చెప్పడంతో, వైద్యులు ఆమె చెవిని కొంచెం కట్ చేసి దానిని బయటకు తీయాల్సి వచ్చింది. అయితే, ఈ అనుభవంతో ఆష్లే ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇలాంటి సెల్ఫీలు దిగేందుకు మరెవరూ ప్రయత్నించవద్దని కోరుతూ ఆసుపత్రిలో దిగిన ఒక ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో ఆష్లే గ్లేవ్ పోస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News