: జ్యోతికతో కలిసి నటిస్తానని ఆశిస్తున్నా: నటుడు సూర్య
తన భార్య, నటి జ్యోతిక సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోకముందే ఆమెతో కలిసి తాను నటిస్తానని ఆశిస్తున్నట్లు నటుడు సూర్య చెప్పాడు. సూర్య నటించిన ‘సింగం 3’ చిత్రం ఈ నెల 3న విడుదల కానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో సూర్య పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చాడు. జ్యోతిక, తాను కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, కానీ, కొన్ని కారణాల వల్ల గత ఏడాది అది జరగలేదని చెప్పాడు. ‘నేను ముందు తల్లిని, ఆ తర్వాతే నటిని’ అని జ్యోతిక తనతో అంటూ ఉంటుందని, మేకప్ వేసుకుని, ప్రతిరోజూ షూటింగ్ కు వెళ్లాలని జ్యోతికకు లేదని ఈ సందర్భంగా సూర్య చెప్పాడు.