: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. తొమ్మిది మంది అరెస్టు


 హైదరాబాద్ లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పనామా సెంటర్ సమీపంలోని ఒక కాంప్లెక్స్ లో ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఎల్బీనగర్ జోన్ ఎస్ వోటీ పోలీసులకు ఈ సమాచారం అందడంతో, ఈరోజు సాయంత్రం వారు రంగంలోకి దిగారు. తనిఖీలు నిర్వహించి వ్యభిచార గృహం నిర్వాహకుడు సహా 9 మందిని అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు యువతులు ఉన్నారు. నిందితులను వనస్థలిపురం పోలీసులకు అప్పగించినట్లు ఎస్ వోటీ పోలీస్ చెప్పారు.

  • Loading...

More Telugu News