: శ్రీలంక అధ్యక్షుడు చనిపోతాడంటూ ప్రచారం చేస్తున్న జ్యోతిష్కుడు అరెస్టు!


శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చనిపోతారంటూ ప్రచారం చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేస్తున్న జ్యోతిష్కుడు విజిత రోహన విజేమునిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 27 లోపు అనారోగ్యం లేదా ఏదైనా ప్రమాదంలో కానీ సిరిసేన చనిపోతారని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక మీడియా శాఖ సెక్రటరీ నిమల్ బోపేజ్ దర్యాప్తునకు రెండు నెలల క్రితం ఆదేశించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఈరోజు ఆయన్ని అరెస్టు చేశారు. కాగా, రోహన విజేముని గతంలో నేవీలో పని చేశాడు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీలంకను సందర్శించిన సందర్భంలో ఆయన్ని హత్య చేసేందుకు యత్నించిన కేసులో రోహన విజేముని జైలు శిక్ష అనుభవించాడు.

  • Loading...

More Telugu News