: ఏవోబీలో దారుణం.. బీఎస్ఎఫ్ జవాన్ల బస్సును పేల్చేసిన మావోయిస్టులు!
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో మావోయిస్టులు పంజా విసిరారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సుంకి - సాలూరు జాతీయ రహదారిపై బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును పేల్చివేశారు. ఈ సంఘటనలో 8 మంది జవాన్లు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మందుపాతర ధాటికి పోలీస్ వాహనం ధ్వంసమైంది. ఏపీ, ఒడిశా మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.