: బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, స్వర్ణభారతి ట్రస్టు లెక్కలు చెప్పాలి: వైఎస్సార్సీపీ నేత గౌతమ్ రెడ్డి
విరాళాలు లేకుండా పార్టీలు నడవడం కష్టమని వైఎస్సార్సీపీ నేత గౌతమ్ రెడ్డి అబిప్రాయపడ్డారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, పార్టీల విరాళాల్లో పారదర్శకత అవసరమని, అయితే అది వాస్తవంలో సాధ్యమవుతుందా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇది కేవలం తన అనుమానం మాత్రమే కాదని, సగటు పౌరుడి అనుమానమని ఆయన చెప్పారు. దీనిని తీర్చాల్సిన బాధ్యత ప్రధానంగా బీజేపీపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. అందుకే ముందుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, స్వర్ణభారతి ట్రస్టులకు సంబంధించిన విరాళాల వివరాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం దేశంలోని రాజకీయ పార్టీలన్నీ బీజేపీని అనుసరిస్తాయని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు.