: మోత మోగించిన స్టాక్ మార్కెట్లు.. దూసుకుపోయిన సెన్సెక్స్


ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఫ్లాట్ గా కొనసాగిన స్టాక్ మార్కెట్లు... జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే జెట్ స్పీడుతో దూసుకుపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి 486 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 28,142 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 155 పాయింట్లు పుంజుకుని 8,716కు పెరిగింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్...
జై ప్రకాశ్ అసోసియేట్స్ (9.55%), ఇండియా సిమెంట్స్ (9.38%), భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ (8.93%), ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ (7.25%), డీఎల్ఎఫ్ (6.74%).

టాప్ లూజర్స్...
సుజ్లాన్ ఎనర్జీ (-5.19%), హ్యాత్ వే కేబుల్ అండ్ డేటా (-2.94%), జెట్ ఎయిర్ వేస్ (-2.72%), హెక్సావేర్ టెక్నాలజీస్ (-2.72%), టాటా కన్సల్టెన్సీ (-2.71%).         

  • Loading...

More Telugu News