: కాన్పూర్ లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. నలుగురి మృతి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని శిథిలాలను తొలగిస్తూ, అందులో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.