: కట్నం తీసుకుని పరారైన పెళ్లికొడుకు!


ఐదు లక్షల రూపాయల కట్నం తీసుకుని పెళ్లికొడుకు పరారయ్యాడు. ఈ ఘటన అనంతపురంలోని సిండికేట్ నగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, గుంతకల్ రైల్వే స్టేషన్ లో చరణ్ అనే యువకుడు పీటీఈగా పనిచేస్తున్నాడు. అనంతపురంలో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వివాహానికంటే ముందే రూ. 5 లక్షల కట్నం తీసుకుని పరారయ్యాడు. దీంతో, వధువు తండ్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా చరణ్ సోదరుడు మాట్లాడుతూ, దీనికంతా కారణం ప్రేమ వ్యవహారమే అని చెప్పాడు. 

  • Loading...

More Telugu News