: మా నాన్న బడ్జెట్ సూపర్: సోనాలీ జైట్లీ


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ నాలుగోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ను మిత్రపక్షాలు చాలా బాగుంది అని పొగుడుతుంటే... ఆడంబరం తప్ప మరేం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన తండ్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన కుమార్తె సోనాలీ జైట్లీ స్పందించారు. ఇది చాలా మంచి బడ్జెట్ అని... మహిళా అనుకూల బడ్జెట్ అని ఆమె ప్రశంసించారు. ఆడపడుచుల కోసం ఎన్నో పథకాలను ప్రకటించారని చెప్పారు. నైపుణ్యాలకు పెద్ద పీట వేశారని అన్నారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా జైట్లీ కుటుంబసభ్యులు ఈరోజు పార్లమెంటుకు వచ్చారు. విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని బడ్జెట్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. బడ్జెట్ ప్రకటన ముగిసిన కాసేపటి తర్వాత బయటకు వచ్చిన సోనాక్షి మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News