: కశ్మీర్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారులకు అమెరికా వీసా నిరాకరణ!
న్యూయార్క్‌లో ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న ప్రపంచ స్నో షూ చాంపియన్‌షిప్‌లో కశ్మీర్‌కు చెందిన క్రీడాకారులు అబిడ్ ఖాన్, తన్వీర్ హుస్సేన్‌లు పాల్గొనాల్సి ఉంది. అయితే, వారికి వీసా ఇచ్చేందుకు అమెరికా నిరాకరించింది. తమ దేశం ప్రస్తుతం పాటిస్తున్న విధానాల కారణంగా ఆ క్రీడాకారులకు వీసా ఇవ్వలేక పోతున్నామని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తేల్చి చెప్పింది. ఈ విషయంపై ఆ క్రీడాకారులు స్పందిస్తూ... న్యూయార్క్‌లోని ఓ మేయర్‌కు ఫేస్‌బుక్ ద్వారా ఈ సమాచారం అందించారు.
అయితే, అమెరికాలో పాటిస్తోన్న ప్రస్తుత వీసా విధానం వల్ల భారతీయులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని, కశ్మీరీ ఆటగాళ్లకి కొన్ని వేరే కారణాలతో వీసాలు ఇవ్వలేదని అమెరికా రాయబార కార్యాలయం అధికారులు స్పష్టం చేశారు. సదరు క్రీడాకారుల వివరాలను రహస్యంగా ఉంచాలి కాబట్టి తాము కారణాలు చెప్పలేమని మీడియాకు తెలిపారు.