: అరుణ్ జైట్లీ బడ్జెట్ ముఖ్యాంశాలు - 2
2017-18 సాధారణ వార్షిక బడ్జెట్ తో పాటే రైల్వే బడ్జెట్ నూ కలిపి రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందుంచారు. జైట్లీ పద్దులోని మరికొన్ని ముఖ్యాంశాలివి.
* నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఐఐటీల అనుసంధానం.
* ఐదు ప్రత్యేక పర్యాటక జోన్ల అభివృద్ధి.
* విద్యా రంగం కోసం ప్రత్యేకంగా డీటీహెచ్ చానల్.
* 600 జిల్లాల్లో ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు.
* నైపుణ్యాభివృద్ధికి రూ. 4 వేల కోట్లతో సంకల్ప నిధి.
* ఫ్లోరైడ్ పీడిత 28 వేల గ్రామాలకు ప్రత్యేక తాగునీటి పథకాలు.
* మహిళా సాధికారత కోసం రూ. 500 కోట్లతో మహిళా శక్తి కేంద్రాలు.
* గర్భిణీలకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ. 6 వేల నగదు బదిలీ.
* గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా.
* గృహ రుణాలిచ్చే బ్యాంకులకు జాతీయ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రూ. 20 వేల కోట్ల రుణం.
* నోట్ల రద్దు ద్వారా వచ్చిన నగదుతో నిండిన బ్యాంకులు.
* పరిమిత స్థాయిలో గృహ రుణాలపై వడ్డీ రేటును ఇప్పటికే తగ్గించిన ప్రధాని.
* భవిష్యత్తులో మరింతగా తగ్గనున్న గృహ రుణ వడ్డీ.
* జనరిక్ ఔషధాల వినియోగానికి ప్రత్యేక విధానం.
* వైద్య పరికరాల ఉత్పత్తికి మరిన్ని నిధులు.
* 2025లోగా క్షయ వ్యాధి నిర్మూలనకు చర్యలు.
* షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి రూ. 52,393 కోట్లు.
* గిరిజనులకు రూ. 31,920 కోట్లు.
* మైనారిటీలకు రూ. 4,195 కోట్లు.
* అంత్యోదయ యోజనకు రూ. 2,500 కోట్లు కేటాయింపు.
* జాతీయ రహదారులకు రూ. 64 వేల కోట్లు.
* ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు రూ. 19,100 కోట్లు.
* వృద్ధులకు 8 శాతం వడ్డీపై ఎల్ఐసీ ప్రత్యేక బాండ్లు.
* గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కోసం భారత్ నెట్ ద్వారా రూ. 10 వేల కోట్లు.
* ఈ సంవత్సరం 1.5 లక్షల గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ.
* రూ. 3.96 లక్షల కోట్లతో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్.
* 20 వేల మెగావాట్ల సౌరశక్తి ఉత్పాదన ఈ సంవత్సరం లక్ష్యం.
* విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు రద్దు.
* ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు.
* బ్యాంకులకు రూ. 10 వేల కోట్ల మూలధన సాయం.
* ప్రధాని ముద్ర యోజన రుణాల లక్ష్యం రూ. 2.44 లక్షల కోట్లు.
* జార్ఖండ్, గుజరాత్ లో కొత్తగా ఎయిమ్స్ ఏర్పాటు.
* త్వరలో మరో రెండు రకాల భిమ్ యాప్స్.
* భిమ్ ఉపయోగిస్తే క్యాష్ బ్యాక్ సౌకర్యం.
* ఇప్పటికే కోటీ 25 లక్షల మంది వద్ద భీమ్ యాప్.
* పీజీ మెడికల్ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంపు.
* వైద్య పరికరాల ధరలు తగ్గించేందుకు చర్యలు.
* ఆరోగ్య కేంద్రల సంఖ్య పెంపు, నిపుణులైన వైద్యుల నియామకం.
* ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకు పెద్దపీట.
* వృద్ధులకు ఆధార్ కార్డే ఆరోగ్య కార్డు.
* నగదు రహిత లావాదేవీల లక్ష్యం రూ. 2,500 కోట్లు.
* ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి వెళితే కఠిన చర్యలు.
* బ్యాంక్ డీఫాల్టర్ల ఆస్తుల జప్తు కోసం కొత్త చట్టం.
* సామాన్యులకు ప్రయోజనాలను దగ్గర చేసేలా నగదు రహిత చెల్లింపు వ్యవస్థ.
* పెట్రోలు బంకులు, ఆసుపత్రుల్లో నగదు రహిత చెల్లింపులకు మరింత ప్రోత్సాహం.