: బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం సాయంత్రం 5 నుంచి ఉదయం 11 గంటలకు ఎందుకు మారింది?
బ్రిటీష్ వారి కాలం నుంచి కేంద్ర బడ్జెట్ ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టే ఆనవాయతీ కొనసాగింది. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇదే సంప్రదాయం 2000 సంవత్సరం వరకు కొనసాగింది. బ్రిటీష్ పాలన సమయంలో సాయంత్రం బడ్జెట్ ను ప్రవేశపెడితే... బ్రిటీష్ పార్లమెంటు లండన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం కల్లా బడ్జెట్ కు ఆమోదం తెలిపేది. అయితే, మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ సంప్రదాయాన్నే కొనసాగించారు. 2001లో ప్రధాని వాజ్ పేయి హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. అప్పటి నుంచి ప్రభుత్వాలు మారినా... బడ్జెట్ ను ఉదయం 11 గంటలకే ప్రవేశపెడుతున్నారు.