: మారిన సంప్రదాయం... ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలుసునన్న స్పీకర్!


125 కోట్ల మంది ఎదురుచూస్తున్న బడ్జెట్ ను ఒక ఎంపీ మృతి చెందాడని వాయిదా వేయడం తగదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె, సభ్యుడు మరణించడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. ఇదే సమయంలో ముందుగా అనుకున్న ప్రకారమే పార్లమెంట్ ముందుకు బడ్జెట్ వస్తుందని అన్నారు. సభ్యుడు మరణిస్తే, సభను వాయిదా వేసే సంప్రదాయాన్ని ప్రభుత్వం వదిలేసినట్టేనా? అన్న ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం చెప్పలేదు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తమకు తెలుసునని, ఇదే విషయాన్ని బీఏసీ సమావేశంలో చర్చిస్తామని, అహ్మద్ కు సంతాపం తెలుపుతామని అన్నారు. సుమిత్రా మహాజన్ వ్యాఖ్యలతో బడ్జెట్ వాయిదా వేయబోవట్లేదని స్పష్టమైంది.

  • Loading...

More Telugu News