: 'శాతకర్ణి' బృందంపై కొనసాగుతున్న దాడులు... విచారణకు రావాలని నితిన్ తండ్రికి నోటీసులు


బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' వసూళ్ల లెక్కలు చెప్పాలంటూ, నిన్న దర్శక నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లపై ప్రారంభమైన ఐటీ శాఖ అధికారుల దాడులు ఈ ఉదయం కూడా కొనసాగుతున్నాయి. చిత్రాన్ని నైజాం ప్రాంతంలో పంపిణీ చేసిన హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఇల్లు, కార్యాలయంపై దాడులు చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సినిమా పంపిణీ డీల్స్ గురించి అడిగారు. ఆపై పలు డాక్యుమెంట్లు తీసుకుని, సుధాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. తాము ఎప్పుడు పిలిస్తే, అప్పుడు విచారణకు రావాలని ఆదేశించారు. సుధాకర్ రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా జిల్లాల వారీగా సినిమా పంపిణీదారులపై నేడు దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News