: కడప జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్.. టీడీపీలోకి ఎమ్మెల్సీ చెంగల్రాయుడు!
కడప జిల్లాలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగలనుందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఎమ్మెల్సీ భత్యాల చెంగల్రాయుడు పార్టీ మారనున్నారంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి పుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ మారనున్నారంటూ ప్రచారం జరుగుతున్నా ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయం సస్పెన్స్‌గా మారింది. అయితే తాజాగా ఆయన టీడీపీలో చేరనున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో మంగళవారం విశాఖపట్టణంలో కడప జిల్లా ముఖ్యనేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి తదితరులు సమావేశమై భత్యాల చేరికపై చర్చించినట్టు సమాచారం. ఈమేరకు భత్యాల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే మరికొన్ని రోజుల్లోనే భత్యాల టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.