: భారతీయ మహిళ కష్టాన్ని దోచేసిన దురదృష్టం!


కాలం కలసిరానప్పుడు ఏం చేసినా బెడిసి కొడుతుందంటారు. అచ్చం అలాగే బ్రిటన్ లో టీచర్ గా జీవితం గడుపుతున్న గుజరాత్ కు చెందిన రేఖా పటేల్ అనే మహిళ జీవితంలో కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే....బ్రిటన్‌ లోని గ్లాసప్‌ అనే ప్రాంతంలో గల సైమండ్లీ అనే గ్రామంలో 2010లో విశాలమైన ప్రాంగణంతో ఉన్న ఓ పాత ఇంటిని సుమారు రెండు లక్షల పౌండ్లు పెట్టి రేఖా పటేల్ కొనుగోలు చేసింది. దీనిని అందంగా తీర్చిదిద్దుకుని జీవితం గడుపుదామని భావించింది. అన్నీ అనుకున్నట్టు జరగవు కదా? ఆమె ఆ ఇంటి మరమ్మతులు చేస్తున్న సమయంలో రెండు రాళ్లు పక్క ఇంటిమీద పడ్డాయి.

అంతే.. అదో పెద్ద వివాదమైపోయింది. దీంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. ఇలా కోర్టుల చుట్టూ తిరగడంతో ఆమె లీగల్‌ ఫీజులకు దాదాపుగా 76,000 ఒకేసారి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏ ఇంటి కోసమైతే గొడవపడి కోర్టుల చుట్టూ తిరిగిందో...అదే ఇంటిని కేవలం రెండు పౌండ్లకే అమ్మేసుకుంది. ఈ క్రమంలో నెలకు 50 పౌండ్లు అద్దె చెల్లించి, అదే ఇంట్లో ఉండేలా ఒప్పందం చేసుకుంది. పదేళ్ల తరువాత ఆమె ఆ ఇంటిని విడిచి వెళ్లాల్సిందే. ఆ తరువాత స్వదేశం చేరుకుని, గుజరాత్ లో పేద పిల్లలకు చదువు చెబుతానని తెలిపింది. 

  • Loading...

More Telugu News