: చిత్తూరు జిల్లాలో 1894 నాటి రాకెట్ శకలం గుర్తింపు
చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని పొలంలో రాకెట్ శకలం కంటబడడం కలకలం రేపుతోంది. పుత్తూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తులు రాకెట్ శకాలన్ని గుర్తించి, ఏదో వస్తువు తమ పొలంలో ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, దానిని రాకెట్ శకలంగా గుర్తించి, ఉన్నతాధికారులకు సమాచారమందించారు. దానిని పరిశీలించిన వారు అది 1894 సంవత్సరానికి చెందిన రాకెట్ శకలంగా గుర్తించారు. దీంతో దానిని స్వాధీనం చేసుకుని, ల్యాబ్ కు తరలించారు. అయితే ఆ రాకెట్ శకలం అక్కడికి ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు.