: 18 లక్షల మందికి నోటీసులు పంపనున్న ఐటీ శాఖ... బ్యాంకు డిపాజిట్లపై కొరడా


నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు జమ అయింది. ఎంతో మంది అక్రమ సంపాదనను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. దేశ వ్యాప్తంగా 18 లక్షల అక్రమ ఖాతాలను ఇన్ కం ట్యాక్స్ అధికారులు గుర్తించారని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హన్ముఖ్ ఆధియా తెలిపారు. నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేసిన వారందరికీ ఐటీ శాఖ ద్వారా నోటీసులు పంపుతామని ఆయన తెలిపారు. మరోవైపు రూ. 2 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వారి సంఖ్య దాదాపు కోటి వరకు ఉందని చెప్పారు.  దీనికితోడు, కరెంట్ ఖాతాల్లో రూ. 12.5 లక్షలకు పైగా జరిగిన డిపాజిట్లను కూడా ఐటీ శాఖ పరిశీలిస్తుందని తెలిపారు.  

  • Loading...

More Telugu News