: అటు రాష్ట్రపతి ప్రసంగం... ఇటు ఎంపీల కునుకు!
ఈ ఉదయం పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు నిద్రలో జోగుతూ కనిపించారు. దీంతో రాష్ట్రపతి ప్రసంగం ఎంపీలకు జోలపాటగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరప్ప మొయిలీ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వరకు పలువురు ఎంపీలు నిద్రమత్తులో జోగుతూ కనిపించారు. సుబ్బరామిరెడ్డి వంటి తెలుగు ఎంపీలు కూడా ఈ సందర్భంలో ఓ కునుకేయడం విశేషం.