: జాతీయ రహదారిపై లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్... దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికుల ఆందోళన


కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో జాతీయ రహదారిపై లిక్విడ్‌ ఆక్సిజన్‌ సిలిండర్లతో వెళ్తున్న లారీ నుంచి ఒక్క‌సారిగా భారీగా ఆక్సిజ‌న్‌ లీకైంది. దీంతో జాతీయ రహదారిపై ద‌ట్ట‌మైన పొగ క‌మ్ముకుంది. లిక్విడ్ ఆక్సిజ‌న్ లీక్ అవుతుండ‌డాన్ని గ‌మ‌నించిన డ్రైవ‌ర్ ఆ లారీ రోడ్డుప‌క్క‌న ఆపేశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు చేరుకొని మంటలు రాకుండా నీళ్లు చల్లుతున్నారు. లీకేజీని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతమంతా తెల్లని దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

  • Loading...

More Telugu News