: ఇరాన్‌పై ఫిర్యాదు చేయడానికి డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్న ఇజ్రాయెల్ ప్రధాని
ఇరాన్ చేసిన క్షిపణి పరీక్షపై ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉంది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ మాట్లాడుతూ... తాను వచ్చేనెల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్నట్లు తెలిపారు. ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని తాను కోరనున్నట్లు పేర్కొన్నారు. క్షిపణి పరీక్షపై ఇరాన్ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే స్పందించిన వైట్‌హౌస్... ఇరాన్ 2015 నుంచి ఇటువంటి పరీక్షలను నిర్వహిస్తోందని, ఈ ఘటన వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. ప్రయోగం పూర్తికాక ముందే క్షిపణిని పేల్చివేయడంతో ఆ దేశం ప్రయోగించిన క్షిపణి వివరాలు సరిగా తెలియలేదని చెప్పింది. క్షిపణి పరీక్షపై స్పందించిన ఇరాన్ తమ వద్ద ఎటువంటి అణ్వాయుధాలు లేవని చెప్పింది.