: దాసరి నారాయణరావు చికిత్సకు స్పందిస్తున్నారు: వైద్యులు
శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దాసరి నారాయణరావు చికిత్సకు స్పందిస్తున్నారని వారు అన్నారు. వెంటిలేటర్ సపోర్ట్ ద్వారా ఆయనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నామని తెలిపారు. ఇన్‌ఫెక్షన్‌ను అదుపు చేయడానికి ఆయనకు కొద్దిసేపట్లో శస్త్రచికిత్స చేయనున్నట్లు చెప్పారు. ఆపరేషన్ తరువాత మరోసారి బులిటెన్ విడుదల చేస్తామని చెప్పారు. మరో రెండు రోజుల పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్పారు.