: జల్లికట్టు పోరాట నేపథ్యంలో హింసకు పాల్పడిన వారిని వదిలిపెట్టం: సీఎం పన్నీర్ సెల్వం
చెన్నయ్ మెరీనా బీచ్‌లో చేపట్టిన జల్లికట్టు ఉద్యమంలో పాల్గొంటున్న వారిని పోలీసులు చెదరగొట్టిన నేపథ్యంలో ఆందోళనకారులు రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే, వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేదిలేదని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. పలు జిల్లాల్లో చోటుచేసుకున్న దాడుల్లో నిందితులను త్వరలోనే గుర్తిస్తామని, వారిని శిక్షిస్తామని ఆయన తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ రోజు వెల్లడించారు. ఈ కమిషన్‌కు హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వం వహిస్తారని, నేటి నుంచి వారంలోగా నివేదికను సమర్పిస్తుందని చెప్పారు.