: పార్లమెంటులో కుప్పకూలిన కేంద్ర మాజీ మంత్రి.. ఆసుపత్రికి తరలింపు


కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అహ్మద్ ఈ రోజు పార్లమెంటులో కుప్పకూలిపోయారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ఈ రోజు పార్లమెంటులో ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి ముందు అహ్మద్ కుప్పకూలి పోయారు. వెంటనే ఆయనను స్ట్రెచర్ మీద తీసుకెళ్లి, అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆయన వెంట ఒక అటెండెంట్ డాక్టర్ కూడా వెళ్లారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో జూనియర్ ఫారిన్ మినిస్టర్ గా అహ్మద్ బాధ్యతలను నిర్వర్తించారు. 

  • Loading...

More Telugu News