: మా దేశంపై నిషేధం విధిస్తే యుద్ధం రావ‌చ్చు.. ట్రంప్ కు పాకిస్థాన్ నేత హెచ్చరిక


ప్ర‌మాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల‌కే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్... ఏడు ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులు, ఇస్లామిక్‌ ఉగ్రవాదులు త‌మ దేశంలోకి ప్ర‌వేశించ‌కుండా చర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్ బిలావల్‌ భుట్టో జర్దారీ ఖండించారు. ఈ చర్య‌లు దేశాల మధ్య గొడ‌వ‌లు రాజేసి, యుద్ధాలకు తావిచ్చేలా ఉందని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిషేధం విధించిన దేశాల జాబితాలో త‌మ దేశాన్ని కూడా చేర్చితే యుద్ధం రావచ్చని హెచ్చరించారు.

ఇది అత్యంత వివాదాస్పద నిర్ణయమని బిలావల్‌ భుట్టో అన్నారు. త‌మ దేశ ప్ర‌జ‌ల‌పై నిషేధం విధిస్తే అది అమెరికాపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయ‌న అన్నారు. కొంత‌మంది ఉగ్రవాదులు చేసిన చర్యలకు మొత్తం ముస్లింలపై ఇటువంటి ఆంక్ష‌లు విధించ‌డం భావ్యం ‌కాద‌ని ఆయ‌న అన్నారు. ఆ దేశం తన నిర్ణయాన్ని వెన‌క్కు తీసుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News