: చెన్నై మెరీనా బీచ్ కు పెనుముప్పు!


చెన్నైలోని మెరీనా బీచ్ కు పెనుముప్పు వాటిల్లింది. నాలుగు రోజుల క్రితం చెన్నై సముద్ర తీరంలో రెండు కార్గో ఓడలు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల ఓడల్లోని చమురు సముద్రంలోకి లీక్ అయింది. మొన్నటి వరకు ఎన్నూరు తీరానికి కొట్టుకు వచ్చిన ఈ చమురు తెట్ట... నిన్న ఉదయానికి మెరీనా తీరాన్ని తాకింది. బీచ్ పొడవునా నలుపు రంగులో చమురు తెట్లు దర్శనమిస్తున్నాయి. బీచ్ లోని ఇసుకతెన్నెలపై కూడా ఇది అక్కడక్కక కనిపిస్తోంది. దీంతో, బీచ్ మొత్తం దుర్వాసన కొడుతోంది. బీచ్ కు వచ్చిన సందర్శకులు ఈ దుర్వాసనను భరించలేక, ముక్కులు మూసుకుంటున్నారు. మరోవైపు ఈ చమురుతెట్టు వల్ల సముద్రంలోని అనేక జలచరాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. చనిపోయిన అనేక చేపలు, తాబేళ్లు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. 

  • Loading...

More Telugu News