: కోహ్లీకి 'డైనింగ్ టేబుల్' హెచ్చరికలు చేసిన సచిన్!


టీమిండియాకు బారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హెచ్చరికలు చేశాడు. ఇంగ్లండ్ సిరీస్ ఎల్లుండితో ముగియనున్న నేపథ్యంలో తరువాతి ఆస్ట్రేలియా సిరీస్ గురించి ఇప్పుడే హెచ్చరించాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ భారత జట్టుకి కీలకమైనది కావడంతో ఈ సిరీస్ కు సన్నాహాలు అత్యుత్తమంగా ఉండాలని ఆకాంక్షించాడు. అలా ఉండాలంటే టీమిండియా ఆటగాళ్లు డైనింగ్ టేబుల్ దగ్గర తక్కువ సమయం గడిపి, ఎక్కువ సమయం జిమ్ లో గడపాలని సూచించాడు. స్మిత్ సారథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ఏమాత్రం అవకాశం చిక్కినా కోలుకోనివ్వదని చెప్పాడు. అందుకే ఆసీస్ కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడాలంటే సన్నాహాలు అత్యుత్తమంగా ఉండాలని సూచించాడు. 

  • Loading...

More Telugu News