: కేసీఆర్ ను మేము పొగడలేదు: టీడీపీ ఎమ్మెల్యే సండ్ర


తెలంగాణ ముఖ్యమంత్రిని తాము పొగిడామని వస్తున్న వార్తలన్నీ అబద్ధమని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. కావాలనే కొందరు ఇలాంటి ప్రచారం మొదలు పెట్టారని చెప్పారు. దళితులకు ఇచ్చేందుకు వ్యవసాయ భూమి దొరికేంత వరకు అర్హులైన దళిత కుటుంబాలు, జిల్లా కలెక్టర్ పేరిట రూ. 15 లక్షల చొప్పున డిపాజిట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాక్ లాగ్ పోస్టులు, ఎస్సీ ఫైనాన్స్ సపోర్ట్ నిధులపై ముఖ్యమంత్రి స్పష్టతను ఇవ్వాలని కోరారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎప్పుడు తీసుకెళతారో చెప్పాలని అన్నారు. సబ్ ప్లాన్ అమలు చేయాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేనట్టుందని మండిపడ్డారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే తీరును బట్టి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News