: ఇదీ నిరుద్యోగ భారతం... గ్రూప్-4 పోస్టులకు పీజీ, డాక్టరేట్ల దరఖాస్తుల వెల్లువ!


పశ్చిమబెంగాల్ లో గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా, నిరుద్యోగ భారతం అసలు రంగు బయటపడింది. విద్యాధికులైన ఎంతో మంది ప్రభుత్వోద్యోగాలకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నోటిఫికేషన్ వెలువడడంతో ఏడవ తరగతి అర్హత కలిగిన ఈ ఉద్యోగాలకు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖాళీలు 6,000 ఉండగా, వాటికి 1,50,000 మందికి పైగా గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేశారు. మరో 24,969 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, ఇంకో 250 మంది పీహెచ్‌డీ హోల్డర్లు ఉద్యోగాలకు దరఖాస్తులు చేశారు. వీటిని స్క్రూట్నీ చేసిన అధికారులు ఆశ్చర్యపోయారు. కాగా, అవుట్ సోర్సింగ్ అంటూ ప్రభుత్వం కూడా ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టులను అప్పగిస్తున్న తరుణంలో ఉద్యోగం ఏదైతే ఏంటని భావించిన విద్యార్థులు భారీ ఎత్తున దరఖాస్తు చేసుకున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా, 2015 లో 368 ప్యూన్ పోస్టులకు 23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News