: ప్రత్యేక హోదాకు, రాయితీలకు సంబంధం లేదు: ఎంపీ జేసీ


 ప్రత్యేక హోదాకు, రాయితీలకు సంబంధం లేదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ప్రయోజనాలన్నీ ప్యాకేజ్ లోనే ఇస్తున్నారని, కేంద్ర కేబినెట్ ఆమోదం పొందితే ప్యాకేజ్ కు చట్టబద్ధత లభిస్తుందని సీఎం తమకు చెప్పారని అన్నారు. ప్యాకేజ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ను కోరానని, వైఎస్సార్సీపీ ఎంపీలు ఏం చేసుకున్నా తమకు సంబంధం లేదని, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఏ రాష్ట్రానికీ హోదా ఉండదని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఉన్నా, అక్కడి నుంచి పరిశ్రమలు ఏపీకి తరలివస్తున్నాయని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News